యాపిల్ ఉద్యోగులకు ఒక చేదువార్త‌. కరోనా టీకా వేయించుకోని ఉద్యోగులు ఇకపై ఆఫీసుకు వచ్చే ప్రతిసారి కరోనా టెస్టు చేయించుకోవాల్సిందేనని యాపిల్ కంపెనీ త‌న ఉద్యోగుల‌కు స్పష్టం చేసింది. ఈ నెల 24 నుంచే ఇది అమల్లోకి వస్తుందని,  వ్యాక్సినేషన్ వివరాలు సమర్పించేందుకు నిరాకరించిన ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని, క‌చ్చితంగా అంద‌రూ టీకా వేయించుకోవాల‌ని సూచించింది. వ్యాక్సినేషన్ పూర్తయిన ఉద్యోగులు మాత్రం వారానికి ఒకసారి ర్యాపిడ్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుందని, రిటైల్ స్టోర్ ఉద్యోగులు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవడానికి బదులు వారానికి రెండుసార్లు చేయించుకోవాలని చెబుతామ‌ని యాపిల్ యాజ‌మాన్యం వెల్ల‌డించింది. అక్టోబరు 24వ తేదీ లోపు వ్యాక్సినేషన్ వివరాలు సమర్పించాలని యాపిల్ త‌న ఉద్యోగులను ఆదేశించింది. మున్ముందు రోజుల్లో వారు తమ ఆధారాలను కూడా చూపించాలని, క‌రోనా విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌ని తెలిపింది. రిటైల్ స్టోర్ల‌కు ప్ర‌జ‌లు వ‌చ్చి వెళుతుంటారు కాబ‌ట్టి అందులో ప‌నిచేసే ఉద్యోగులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: