భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి శుక్ర‌వారం ఉద‌యం 10గంట‌ల‌కు జాతినుద్దేశించి మాట్లాడారు.క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. దేశ ప్ర‌జ‌ల క‌ర్త‌వ్యం, దీక్ష మూలంగానే ఈ విజ‌యం సాధించాం.  స‌బ్‌కా సాథ్‌.. స‌బ్‌కా వికాస్‌..స‌బ్‌కా వ్యాక్సిన్ మ‌న నినాదం. ఇది భార‌తీయులంద‌రూ గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించాం. ప్ర‌పంచంలోనే రెండ‌వ స్థానంలో ఉన్నాం. చైనా మొద‌టిస్థానంలో ఉన్న‌ది. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో వ్యాక్సిన్‌ల‌ను రూపొందించాం. ఇప్ప‌టికీ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల్సిందే.  వందకోట్ల వ్యాక్సిన్ అనేది విజయం కాదు సంకల్పం. భారతదేశంలో ఉన్న‌టువంటి ఫార్మా శ‌క్తిని మ‌రోసాని ప్ర‌పంచానికి చాటి చెప్పారు.

అదేవిధంగా ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించారు. అక్క‌డ వ్యాక్సిన్ వార్ రూమ్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంబరాలు జ‌రుపుకున్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ వేసిన దేశంగా చరిత్ర భార‌త్ ఒక  రికార్డును న‌మోదు చేసింద‌ని కొనియాడారు. వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ దేశాల‌న్ని మ‌న‌దేశంతో పోటీ ప‌డుతున్నాయి. రోనా వ్యాక్సిన్ వల్ల భారత్ స‌త్తా ఏమిటో చూపించాం. 2021 జనవరి 16 నుండి వ్యాక్సిన్ ప్రారంభం అయింది.  2021 అక్టోబ‌ర్ 21 నాటికి 100 కోట్ల మార్కును చేరుకున్న‌ది. ఈ వ్యాక్సిన్‌తో న‌వ‌భార‌త్ కు నాందిప‌లికింద‌ని మోడీ వెల్ల‌డించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: