దేశంలో ప్రజాభిమానం మెండుగా కలిగిన అత్యుత్తమ ముఖ్యమంత్రిగా త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ మరోమారు ప్రథమస్థానం ద‌క్కించుకున్నారు. ‘సీఎన్‌ఓస్‌ ఒపీనియోమ్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా ఐదుగురు ఎంపిక కాగా వారిలో మొదటి స్థానంలో స్టాలిన్‌ నిలిచారు. ఆ సంస్థ త‌మిళ‌నాడు రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది స్టాలిన్‌ పరిపాలన భేషుగ్గా ఉందని, సూప‌ర్ అంటూ  కితాబిచ్చారు. 12 శాతం మంది మాత్రమే ఆయన పాలనపై అసంతృప్తిని ప్రకటించిన‌ప్ప‌టికీ అది కూడా పూర్తిస్థాయి వ్య‌తిరేక‌త కాద‌ని సంస్థ పేర్కొంది. ఇదే విధంగా దేశంలో ప్రజాభిమానం ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ మొదటి స్థానం సంపాదించుకోవ‌డంతోపాటు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని ఆయ‌న వ‌మ్ము కాకుండా చూస్తున్న‌ట్లు ప్ర‌జ‌లంతా అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని పేర్కొంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, ఒడిశా, అసోం ముఖ్యమంత్రులు నిలిచిన‌ట్లు ‘సీఎన్‌ఓస్‌ ఒపీనియోమ్‌’ వెల్ల‌డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: