మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓట‌మి పాలైన ప్ర‌కాష్ రాజ్ ఆ త‌ర్వాత కూడా మంచి పోరాట స్ఫూర్తిని క‌న‌ప‌రుస్తున్నారు. త‌న‌మీద న‌మ్మ‌కంతో ఓటువేసిన వ్య‌క్తుల‌కు తాను జ‌వాబుదారీగా ఉంటాన‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినందుకు బాధ‌గా లేద‌ని, కానీ అందుకు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం వ్య‌వ‌హ‌రించిన తీరే అస‌మంజ‌సంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంట‌నే కార్యాచ‌ర‌ణ‌లోకి దిగారు. ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌లు జ‌రిగితే క‌చ్చితంగా తాను గెలుపొందేవాణ్ని అని, కానీ ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేద‌ని, కొంత‌మంది వ్య‌క్తులు ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలోను, కౌంటింగ్ కేంద్రంవ‌ద్ద ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గానికి చెందిన స‌భ్యుల‌ను బెదిరింపుల‌కు గురిచేశార‌ని ప్ర‌కాష్ రాజ్ ఆరోపించారు. అందుకు త‌గ్గ వీడియో పుటేజ్‌ను ఆధారంగా విడుద‌ల చేశారు. ఓడిపోయిన రెండోరోజు నుంచే ఆయ‌న కార్యాచ‌ర‌ణ‌లోకి దిగారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌ప‌న‌, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవాల‌నే ఆలోచ‌న ఉన్న‌వారు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ, అది వారిని గాయ‌ప‌రిచిన‌ప్ప‌టికీ అస‌లు నిజం ఏమిట‌న్న‌ది ప్ర‌జ‌ల ముందు ఉంచ‌డానికి ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని మాత్రం అంద‌రూ అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa