రాధే శ్యామ్ సినిమా టీజ‌ర్ ను వ‌దిలాడు డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్. మొత్తం ఇంగ్లీషులోనే ప్ర‌భాస్ స్పీచ్ ఉంది. ఇంకేం వండ‌ర్.. అస్స‌ లు ఆయ‌న చెప్పాల‌నుకుంటున్న‌దేదో తెలుగులోనే చెప్పొచ్చుగా! పాపం చాలా మంది ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. అయినా సినిమా తెలుగులో తీసిన‌ప్పుడు ఈ ఇంగ్లీషు గోలేంటి. విన్న‌వాళ్లంతా ప్ర‌భాస్ కు మంచి ఇంగ్లీషు వ‌చ్చు అని అనుకోవాలా లేదా ప్లాన్ ఇండియా సినిమా క‌నుక ఆ మాత్రం ఇంగ్లీషు మాట్లాడిస్తే త‌ప్పేంటి అని అనుకుంటున్నాడా.. ఏదేమ‌యినా మీరు ఒక తెలుగు సినిమా తీసి త‌రు వాత మ‌ల్టీ లింగ్విల్ అదేలేండి బ‌హుభాషల‌లో అనువాదం చేయాల‌న్న త‌లంపులో భాగంగా ప్యాన్ ఇండియా అన్న ఒక తోక మాట త‌గి లించి మార్కెట్ చేసుకుంటున్నారు. దీనిని ఎవ్వ‌రూ కాద‌న‌రు కానీ హీరోయిన్ లేకుండా ఆ టీజ‌ర్ ఏంట‌య్యా...? పూజా బేబీ ఫ్యాన్స్ హ‌ ర్ట్ ..ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట్ .. బాబ్బాబు సినిమాలో డైలాగులు అన్నీ తెలుగులోనే చెప్పించు..నీ ప‌ర‌భాషా పాండిత్యం మాకొద్దు గాక వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: