రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఎక్క‌డ చూసినా     'బోస‌డీకే'
గురించే చ‌ర్చ న‌డుస్తోంది. అస‌లు ఈ ప‌దం ఏమిటి. ఎక్క‌డ వాడ‌తారు? ఎందుకు  వాడ‌తారు?  దానికి ఎన్ని అర్థాలున్నాయి? అది అస‌భ్య ప‌ద‌జాలం కింద‌కు వ‌స్తుందా?  రాదా? అంటూ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌తోపాటు సామాజిక మాధ్య‌మాల్లో షేరింగ్స్.. ఇలా న‌డుస్తోంది ఏపీలో వాతావ‌ర‌ణం. తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి ప‌ట్టాభి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ  'బోస‌డీకే'


ప‌దాన్ని ఉప‌యోగించారు. ఆ త‌ర్వాత వైకాపా కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంతోపాటు రాష్ట్రంలోని ఇత‌ర కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి కూడా ఈ ప‌దం వాడ‌కంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఒక ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకొని అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగిస్తే ఆయ‌న అభిమానులంతా తిర‌గ‌బ‌డ‌తార‌ని చెప్పారు. 30 నుంచి 40 సంవ‌త్స‌రా క్రితం ఎక్కువ‌గా ఈ ప‌దాన్ని ఉప‌యోగించేవార‌ని, కాల‌క్ర‌మేణా వాడుక భాష‌లో దీన్ని ఉప‌యోగించ‌డం మానేశార‌ని, కొన్ని రాష్ట్రాల్లో ఇది ఊత‌ప‌దజాలంగా ఉప‌యోగించేవార‌ని, భాష‌నుబ‌ట్టి, ప్రాంతాన్నిబ‌ట్టి, వాడే విధానాన్ని బ‌ట్టి అర్థం మారుతుంటుంద‌ని తెలుగు భాషా పండితులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap