తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. ఆయ‌న‌తోపాటు మ‌రికొంద‌రు నేత‌లు కూడా ఉన్నారు. నేటి మధ్యాహ్నం 12.30కి చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్రంలో పరిస్థితిని చంద్రబాబు వివరించ‌డంతోపాటు తెదేపా కార్యాలయ విధ్వంస ఘటనపై  ఫిర్యాదు చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఏపీలో డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా కు సంబంధించిన విష‌యాల‌పై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక అందించ‌నున్నారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ ను తెదేపా నేతలు కోరారు. అలాగే మ‌రికొంద‌రు కేంద్ర మంత్రుల్ని కూడా క‌లుస్తామ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. రెండు రోజులు గ‌డిస్తేకానీ వీరంతా ఎవ‌ర్ని క‌లిశార‌నే విష‌యంలో ఒక స్ప‌ష్ట‌త రాదు. ప్ర‌ధాన‌మంత్రి, హోంమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందునుంచి వీరితో బాబుకు స‌ఖ్య‌త లేక‌పోవ‌డం, వీరిపై చంద్ర‌బాబు ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డంవంటివ‌న్నీ కార‌ణాలుగా వైసీపీ వ‌ర్గాలు చూపిస్తున్నాయి. ఏమైన‌ప్ప‌టికీ చంద్రబాబుకు వీరిద్ద‌రూ అపాయింట్‌మెంట్ ఇస్తే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారే అవ‌కాశం కూడా క‌న‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: