తెలంగాణాలో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ రాజకీయంలో ప్రతీ చిన్న విషయం హైలెట్ అవుతుంది. ఉదయం 10.30గంటలకు బీఆర్కే భవన్ వద్ద సిటీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న నేపధ్యంలో నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపటాన్ని వ్యతిరేకిస్తోన్నది ఆ పార్టీ. జనవరి ఒకటి నుంచి నగరరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేదమన్న మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది.

రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఫ్లెక్సీలు పనికొస్తాయని కేటీఆర్ గత వ్యాఖ్యలను గుర్తుచేస్తోన్న కమలనాథులు... ఇప్పుడు తన ముఖాన్ని చూసుకోవటానికే ఫ్లెక్సీలను కేటీఆర్ ఏర్పాటు చేయించుకున్నాడా? అని ఎద్దేవా చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాదు... ఇతర పార్టీలకు కోసమే నిబంధనలా?   అని మండిపడుతున్నారు. వివిధ విగ్రహాలకు సైతం టీఆర్ఎస్ తోరణాలను కట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బీఆర్కే భవన్ వద్ద దర్నాలో బీజేపీ నేతలు, కార్పోరేటర్లు పాల్గొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts