ర‌క‌కాల అస‌మ్మ‌కాల మ‌ధ్య గులాబీ జెండా ఎగిరింద‌ని కేసీఆర్ అన్నారు. స్వ‌తంత్య్ర పోరాటం త‌ర‌హాలోనే తెలంగాణ ఉద్య‌మం కోన‌సాగింది. మొద‌టిసారి 2001లో జ‌ల‌దృశ్యంలో తెలంగాణ జండా ఎగిరింద‌న్నారు. తెలంగాణ వాళ్ల‌కు ప‌రిపాల‌న సాధ్యం కాద‌ని అన్నార‌ని...మావోయిస్టుల రాజ్యం వ‌స్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేశార‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరెంట్...మ‌రియు ఆదాయాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు ఉంద‌ని చెప్పారు. టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా త‌న‌ను ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధ‌న్య‌వాదాలు చెప్పారు . 

తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ ఉద్య‌మాల‌ను నిర్దేశించిందంటూ కేసీఆర్ చెప్పారు. సాగునీటి రంగంలో విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏఏ రంగాల్లో తెలంగాణ వెన‌క‌ప‌డుతుంద‌న్నారా ఆ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుంద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న తెలంగాణ నేడు అభివృద్ధి ప‌తంలో న‌డుస్తుంద‌న్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మోయడానికి హమాలీలు ఆడించడానికి రైస్ మిల్లు సరిపోవడం లేద‌న్నారు .




మరింత సమాచారం తెలుసుకోండి: