నా జోలికి ఎవరూ రారు అంటున్నఎం.పి

'నేను అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడిని. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తో సహా ఎవరూ జోలికి ఎవరూ రారు. మీకు ఆ విషయం తెలియదా ?' అని ఓ నేత బహిరంగంగా ప్రకటించారు. 'ఖరీదైన కారు కొనుక్కొనే నిమిత్తం అక్షరాల నలభై లక్షల రూపాయలు రుణం తీసుకున్నాం. ఈడి ఇది చూసి ఆశ్చర్య పోతుంది' అని కూడా సదరు పార్లమెంట్ సభ్యుడు సెలవిచ్చాడు.
సంజయ్ పాటిల్ మహారాష్ట్రలోని సంగ్లీ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నంత కాలం ఈడి నా జోలికి రాదు' అని అన్నారు. 'మేము కారుకొనుక్కోనే నిమిత్తం నలభై లక్షల రూపాయలు రుణాన్ని బ్యాంకుల నుంచి పొందాము. దీనిని చూపి ఈడి కూడా విస్తుపోతుంది' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇకో పోతే ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేత హర్షవర్దన్ పాటిల్ కూడా  ఇదే విషయంలో చమత్కరించారు. ఇక పై 'నో ఎంక్వైరీస్ ' అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర రాజకీయాలలో కురువృద్దుడుగా పేరుగాంచిన ఎన్.సి.పి నేత శరత్ పవార్ ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన సొంతానికి వాడుకుంటోందని అన్నారు. వీటి దర్యాప్తు లు నిష్పక్షపాతంగా లేవని   ఆరోపించారు. ఈ  ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ నేతలు నివ్వెర పోయే ప్రకటనలు చేశారు. హర్షవర్దన్ సీనియర్ నేత,  పూణె జిల్లా  లోని ఇందపూర్ కు చెందిన మాజీ శాసన సభ్యుడు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన  2019 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ed