ఆనందయ్య కంటి చుక్కల కరోనా మందు వేసేందుకు చేసుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దరఖాస్తు పరిశీలనలో సాంకేతిక కారణాలు చూపిస్తూ తిరస్కరించ వద్దని హైకోర్ట్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తమకు దరఖాస్తు చెయ్యలేదు అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దరఖాస్తు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని ధర్మాసనం ముందు ఉంచారు ఆనందయ్య తరుపు న్యాయవాది అశ్విని కుమార్.

వెంటనే దరఖాస్తును పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చింది కోర్ట్. కంటి మందు వలన ప్రమాదం ఉందన్న ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్ట్ షాకింగ్ రిప్లై ఇచ్చింది.... కరోనా వలన ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది మరణించారు, ఆనందయ్య మందు వలన ఎంతమంది మరణించారు లెక్కల తీసుకుందామా అని ధర్మాసనం నిలదీసింది. దీనివల్ల మీరే ఇబ్బంది పడతారని హై కోర్ట్ తెలిపింది. ఆనందయ్య కరోనా మందు ఉపయోగానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్విని కుమార్ స్పష్టం చేసారు. రిట్ పిటిషన్ పై విచారణ ముగించిన ధర్మాసనం... ఆనందయ్య మందు దరఖాస్తును వెంటనే పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్ట్ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: