తెలుగు రాష్ట్రాలలో ఓ  సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న‌ది. వైఎస్ వివేకా హ‌త్య కేసులో  బుధ‌వారం సీబీఐ ఛార్జీషీట్ దాఖ‌లు చేసింది. వివేకా మృతికి న‌లుగురు కార‌ణం అని సీబీఐ వెల్ల‌డించింది. గంగిరెడ్డి, సునీల్‌యాద‌వ్‌, ఉమాశంక‌ర్‌రెడ్డి, ద‌స్త‌గిరి అభియోగాలు న‌మోదు చేసింది.  ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌లో నిందితుల‌ను అరెస్టు చేశాం . అరెస్టు చేసిన నిందితుల‌ను జ్యూడిషియ‌ల్ రిమాండ్ కు త‌ర‌లించాం. అందులో ఇద్ద‌రు నిందితుల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని సీబీఐ అధికారులు వెల్ల‌డించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొన‌సాగుతోంది. వివేకా హత్యకేసులో పులివెందుల కోర్టులో  సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. ఇప్ప‌టికే  కడప నుంచి పులివెందుల కోర్టుకు చేరుకున్నారు సీబీఐ అధికారుల బృందం. కేసుకు సంబంధించి వివిధ పత్రాలతో కోర్టుకు చేరుకున్నారు. న‌వంబ‌ర్ 4 వ తేదీకి  సునీల్ అరెస్ట్ చేసి 90 రోజులు గ‌డుస్తున్న నేప‌థ్యంలో సునీల్‌యాద‌వ్‌, ఉమాశంక‌ర్‌రెడ్డి ఇరువురిపై ఛార్జిషీట్ దాఖ‌లు చేశారు.  అదేవిధంగా తన తండ్రి వైఎస్ వివేకా కేసు ఛార్జీ షీటు కాఫీ ఇవ్వాలని  వివేకా కుమార్తె సునీత కోర్టులో మొర‌పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: