వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మ‌రో వారం రోజుల్లో రూ.100 పెంచే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే పెట్రోల్‌, డీజిల్ రెండూ స్టాక్‌మార్కెట్‌లో షేర్ల‌లా ప్ర‌తిరోజూ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అర్థ‌రాత్రి 12.00 గంట‌ల స‌మ‌యంలో రెండు గంట‌ల‌పాటు పెట్రోలు బంకులు కూడా మూసేస్తున్నారు. ఆ త‌ర్వాత తెరిచి పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా పెట్రోలు పోస్తున్నారు. అలాగే వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఈనెల ఆరోతేదీన రూ.15 పెంచిన చ‌మురు కంపెనీలు ఈసారి ఏకంగా రూ.100 పెంచేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ లా ఎల్‌పీజీపై నియంత్ర‌ణ ఎత్తివేస్తున్న‌ట్లు కేంద్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే గ‌తేడాది రాయితీలు తొల‌గించింది. పెరుగుతున్న వంట గ్యాస్ ధ‌ర‌ల మ‌ధ్య ఉండే అంత‌రాన్ని భ‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌మురు కంపెనీలకు ఎటువంటి హామీ ఇవ్వ‌లేదు. కేంద్రం నుంచి హామీ రానిప‌క్షంలో మ‌రింతగా ధ‌ర‌లు పెంచేందుకు కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముడిచ‌మురు ధ‌ర‌లు కూడా రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్ర‌తిరోజు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డ‌మేకానీ త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న అందించాల్సిన ప్ర‌భుత్వాలు కూడా ప‌న్నుల రూపంలో సొమ్ములు రాబ‌ట్టుకునే ప్ర‌భుత్వ కంపెనీలా మార‌డంతో వారికి క‌ష్టాలు త‌ప్ప‌డంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gas