ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌రిపాల‌న అందిస్తూ ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల‌ను క‌ల్పించాల్సిన బాధ్య‌త పాల‌కుల‌పై ఉంటుంది. అటువంటి పాల‌కులే ప్ర‌యివేటు కంపెనీ య‌జ‌మానుల్లా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌ల‌ను ఆదుకునేదెవ‌రు?  ప్ర‌స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్ర‌జాస్వామ్య కూట‌మి ప్ర‌భుత్వం సాగిస్తున్న ప‌రిపాల‌న కూడా అలాగే ఉంది. కొద్దినెల‌లుగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ప్ర‌తిరోజు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లంతా విద్యుత్తు వాహ‌నాల‌వైపు దృష్టిసారిస్తున్నారు. అలాగే వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రాయితీ కూడా ఎత్తేశారు. దాదాపు రూ.900 వ‌సూలు చేస్తున్న చ‌మురు కంపెనీలు ఈసారి ఏకంగా రూ.100 పెంచ‌బోతున్నాయి. సామాన్యుల ప‌రిస్థితి ఏమిటి? అనే క‌నీస ఆలోచ‌న కంపెనీలు చేయ‌డంలేదు. త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంది కాబ‌ట్టి పెంచుతున్నామంటున్నారు. రాయితీలు మాత్రం ఇవ్వం అని కేంద్రం కంపెనీలో అంటోందికానీ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డంలేదు. దీనిపై ఎవ‌రికీ స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఎట్టి ప‌రిస్థితుల్లోను దేనికీ స్పందించ‌రు. ఆయ‌న దేనికీ స‌మాధానం ఇవ్వ‌కుండా మౌనం వ‌హిస్తార‌ని ఏడున్న‌ర సంవ‌త్స‌రాలుగా అంద‌రికీ తెలిసిందే. వంట గ్యాస్ రూ.100 పెంచినా, 500 పెంచినా మోయ‌లేని భారాన్ని మోయ‌క త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gas