ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ తీసుకునే నిర్ణ‌యంపై చ‌మురు కంపెనీలు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.100 పెంచాలా? వ‌ద్దా? అనేది ఆధార‌ప‌డివుంది. వారం రోజుల్లో సిలిండ‌ర్‌పై రూ.100 పెంచ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ వాటిని పెంచుతున్న‌ట్లుకానీ, లేద‌ని ఖండించ‌డంకానీ కంపెనీలు చేయ‌లేదు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్ర‌జ‌ల్ని మాన‌సికంగా సంసిద్ధుల్ని చేసేందుకే వారం రోజులు ముందుగా పెంపు నిర్ణ‌యాన్ని మీడియాకు విడుద‌ల చేసిన‌ట్లు భావిస్తున్నారు. గ‌తంలో రూ.10, రూ.15 అలా పెరుగుతూ వ‌చ్చే సిలిండ‌ర్‌పై ఏకంగా రూ.100 పెంచ‌డ‌మంటే సాహ‌స‌మే. కానీ అంత‌కుమించి త‌మ ఎదుట ప్ర‌త్యామ్నాయం లేద‌ని కంపెనీలు చెబుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఏమీ మాట్లాడ‌టంలేదు. స‌హ‌జంగానే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఏమీ మాట్లాడ‌రు. ఆయ‌న మ‌న్‌కీబాత్‌, లేదంటే విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే మాట్లాడ‌తారు. ఇప్పుడు కూడా ఆయ‌న ఏమీ స‌మాధానం ఇవ్వ‌డంలేదు కాబ‌ట్టి సిలిండ‌ర్ ధ‌ర పెరుగుతున్న‌ట్లుగా భావించి ప్ర‌జ‌లంతా అందుకు సంసిద్ధులుగా ఉండ‌ట‌మే మంచిద‌నే అభిప్రాయాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

gas