అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని కోరుతూ రాజ‌ధాని రైతులు చేస్తున్న ఉద్య‌మానికి డిసెంబ‌రు 17వ తేదీతో రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌వుతాయి. ఈ సంద‌ర్భాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో 450 కిలోమీట‌ర్ల మ‌హాపాద‌యాత్ర‌ను త‌ల‌పెట్టారు. న‌వంబ‌రు ఒక‌టోతేదీ నుంచి 45 రోజుల‌పాటు తుళ్లూరు నుంచి తిరుమ‌ల వ‌ర‌కు పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది. రాజ‌ధాని గ్రామాల్లోని రైతులంతా ఈ యాత్ర‌లో పాల్గొంటున్నారు. తుళ్లూరు నుంచి తాడికొండ‌, గోరంట్ల‌, గుంటూరు, ప్ర‌త్తిపాడు, పెద‌నందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగ‌రాయ‌కొండ‌, కావ‌లి, కొవ్వూరు, శ్రీ‌కాళ‌హ‌స్తి, తిరుప‌తి మీద‌గా తిరుమ‌ల వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతుంది. డిసెంబ‌రు 17వ తేదీన తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. యాత్ర‌కు మొద‌ట్లో పోలీసుల నుంచి అనుమ‌తి రాక‌పోయిన‌ప్ప‌టికీ కోర్టు జోక్యంతో అనుమ‌తిచ్చారు. ఈరోజు గుంటూరు న‌గ‌రంలో నిర్వ‌హించే ఒక స‌మావేశంలో రాజ‌ధాని జేఏసీ నేత‌లంతా స‌మావేశ‌మై యాత్ర‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రి ఆ నిర్ణ‌యం ఏమిట‌నేది స‌మావేశం ముగిసిన త‌ర్వాతే వెల్ల‌డికానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: