ఢిల్లీ – హ‌ర్యానా స‌రిహ‌ద్దులో గురువారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. ఆటో కోసం ఎదురుచూస్తున్న మ‌హిళ‌ల‌పై ట్ర‌క్కు దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో మ‌హిళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. మృతి చెందిన మ‌హిళ‌ల‌ను పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన వ్య‌క్తిగా పోలీసులు గుర్తించి బంధువుల‌కు స‌మాచార‌మందించారు. ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే ట్ర‌క్కు డ్రైవ‌ర్ పారిపోయాడు. ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న టిక్రీ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. 11 నెల‌ల నుంచి రైతులు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వారికి ఎటువంటి స‌హ‌కారం అందించడంలేదు. 11 సంవ‌త్స‌రాలైనా తాము నిర‌స‌న చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని, అందులో ఎటువంటి సందేహం లేద‌ని, త‌మ‌కోసం కాద‌ని, భ‌విష్య‌త్తు త‌రాల‌కోస‌మ‌ని రైతులు, రైతుసంఘాల నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: