ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో 11 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించారు. రికార్డుస్థాయిలో కేసులు పెరుగుతుండ‌టంతో ఆ దేశం ఉలిక్కిప‌డుతోంది. అన్ని కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 83 లక్ష‌ల కేసులు రాగా 2.3 ల‌క్ష‌ల‌కు పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే ర‌ష్యా అనుమ‌తిచ్చింది. ఈనెల 30 నుంచి న‌వంబ‌రు 11వ తేదీ వ‌ర‌కు వేత‌నంతో కూడి సెల‌వుల‌ను ఇప్పటికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ టీకాపై ర‌ష్యా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మాత్రం టీకాలు వేయించుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేదు. ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్యాలో 32 శాతం మంది మాత్ర‌మే టీకాలు తీసుకున్నారు. మ‌రోవైపు సింగ‌పూర్‌లో గంట‌ల వ్య‌వ‌ధిలో కేసుల సంఖ్య వేల‌ల్లోకి చేరుకుంటోంది. దీంతో సింగ‌పూర్ అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా కేసులు సున్నాస్థాయిలో ఉండాల‌నే ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తోన్న చైనా అందుకు త‌గ్గ‌ట్లుగా ఒక్క కేసు న‌మోదైనా క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. లాక్‌డౌన్లు పెడుతోంది. దీనిపై ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న వ‌స్తున్నా లెక్క‌చేయ‌డంలేదు. ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేస్తుంటే క్ర‌మంగా ప్ర‌పంచ‌మంతా ఆంక్ష‌ల ఛ‌ట్రంలోకి వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని వైద్య‌నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: