క‌రోనా సింగ‌పూర్‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత తొలిసారిగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఆ దేశంలో 5324 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింది. పాజిటివ్ కేసులు పెద్ద‌సంఖ్య‌లో ల్యాబుల్లో గుర్తించామ‌ని, ఇందుకు కార‌ణాల‌ను అన్వేషిస్తున్నామ‌ని సింగ‌పూర్ వైద్య‌, ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మొద‌టినుంచి క‌రోనా నియంత్ర‌ణ‌లో అన్నిదేశాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తోన్న సింగ‌పూర్‌లో కూడా కేసులు పెరుగుతుండ‌టంపై అక్క‌డి ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. టీకా రెండు డోసులు ప్ర‌జ‌లంద‌రికీ వేయించేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. మ‌రోవైపు అమెరికా, బ్రిట‌న్‌, ర‌ష్యా, చైనా త‌దిత‌ర దేశాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతుండ‌టం ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఒక్కోదేశంలో ఒక్కో వేవ్ ముగిసిన‌ప్ప‌టికీ ఈ కేసుల తీవ్ర‌త‌ను బట్టి చూస్తే మ‌రో వేవ్‌కు సిద్ధంగా ఉండాల‌నిపిస్తోంద‌ని నిపుణులు అంటున్నారు. చైనా త‌న దేశంలో క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోంది. కేసులు సున్నాకు చేరుకోవ‌డ‌మే లక్ష్యంగా అక్క‌డి ప్ర‌భుత్వం ఇటువంటి ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తోందంటూ ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నా ప్ర‌భుత్వం వెన‌కాడ‌టంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: