ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని కోరుతూ నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మం చేస్తున్న రైతుల‌క‌న్నా మీకు సినీ న‌టుడు నాగార్జున ఎక్కువ‌య్యాడా? అంటూ రాజ‌ధాని రైతులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నారు. వారు చేస్తున్న ఉద్య‌మం డిసెంబ‌రు 17వ తేదీకి రెండు సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంటుంది. ఇన్నేళ్లుగా క‌నీసం క‌ల‌వ‌డానికి కూడా అమ‌నుతి మంజూరు చేయ‌ని జ‌గ‌న్‌తో హైద‌రాబాద్ టిప్‌టాప్ గా వ‌చ్చిన నాగార్జున భేటీ అయ్యారు.. స‌ర‌దాగా భోజ‌నం చేశారు.. వారిద్ద‌రికున్న వ్యాపార లావాదేవీలు మాట్లాడుకున్నారు.. చ‌ర్చించుకున్నారు.. భోజ‌నం చేసి నాగార్జున వెళ్లిపోయారు. ముఖ్య‌మంత్రి క‌ళ్లెదుటే దీక్ష‌లు చేస్తున్న రైతుల‌ను క‌ల‌వ‌డానికి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ర‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు నిల‌దీస్తున్నారు. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఆంక్ష‌ల‌ను త‌మ‌పై అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ శాంతియుతంగానే నిర‌స‌న తెలియ‌జేస్తున్నామ‌ని, అయినా ముఖ్య‌మంత్రి మూడు రాజ‌ధానులంటూ ప్ర‌క‌టించ‌డంతో అమ‌రావ‌తిలో కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: