ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌మే ఇక‌నుంచి సినిమా టికెట్లు విక్ర‌యించ‌నుంది. దీనివ‌ల్ల నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. వాస్త‌వానికి ప్ర‌భుత్వ ఉద్దేశం ఈ సినిమా టికెట్ల వ్యాపారాన్ని చూపించి బ్యాంకుల నుంచి సొమ్ముల‌ను స‌ర్దుబాటు చేసుకొని వినియోగించుకోవాల‌నే యోచ‌న‌లో ఉంది. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మిన వెంట‌నే నిర్మాత‌ల‌కుకానీ, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కుకానీ సొమ్ములు రావ‌డం క‌చ్చితంగా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని సినీరంగానికి చెందిన విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంట‌ర్నెట్‌, ఎస్ ఎంఎస్‌, ఫోన్‌కాల్‌తో కూడా టికెట్లు బుక్‌చేసుకునే స‌దుపాయాన్ని అందుబాటులోకి తేనున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ధియేట‌ర్ల వ‌ద్ద ట్రాఫిక్ ర‌ద్దీని నియంత్రించేందుకు, ప్రేక్ష‌కుల స‌మ‌యాన్ని ఆదా చేసేందుకు, ప‌న్నులు ఎగ్గొట్ట‌డాన్నినివారించేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. దీనిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మాత్రం నిన్న మంత్రి మండ‌లిలో ఆమోద‌ముద్ర వేసింది. కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి.. ప్ర‌భుత్వ సినిమా టికెట్లు అందుబాటులోకి వ‌స్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: