సినిమా ధియేట‌ర్ల వ‌ద్ద ట్రాఫిక్‌ను నివారించేందుకు, ప్రేక్ష‌కుల స‌మ‌యం ఆదాచేసేందుకే ఆన్‌లైన్లో సినిమా టికెట్ల అమ్మ‌కం విధానాన్ని తీసుకొస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈరోజుల్లో అంద‌రూ టికెట్లు ఆన్ లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. స‌మ‌యానికి ధియేట‌ర్‌కు వ‌స్తున్నారు. గ‌తంలో ఉన్న‌ట్లు బుకింగ్‌ల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల‌బ‌డి తోసుకోవ‌డాలు, గొడ‌వ‌ల్లాంటివి ఉంటే ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం చెబుతున్న కార‌ణాల‌కు ఒక అర్థం ఉంటుంది. అంతా ఆన్‌లైన్ యుగం అయిపోయి.. ప్రేక్ష‌కులు ధియేట‌ర్ల‌కు రావ‌డ‌మే క‌ష్టమ‌వుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వం చెబుతున్న కార‌ణాలు హేతుబ‌ద్ధంగా లేవు. ఎంత అగ్ర‌హీరో సినిమా విడులైనా ఏ ధియేట‌ర్‌వ‌ద్ద ట్రాఫిక్ ఉండ‌టంలేదు. గ‌తంలోలా ఒక‌టి, రెండు ధియేట‌ర్ల‌లో విడుద‌ల‌చేసి ఎక్కువ రోజులు ఆడించే ప‌రిస్థితులు లేవు. ఎక్కువ ధియేట‌ర్ల‌లో విడుద‌ల‌చేసి క‌లెక్ష‌న్లు వ‌సూలుచేసుకొని రెండువారాల‌కు, మూడువారాల‌కు ధియేట‌ర్ల నుంచి త‌ట్టా బుట్టా స‌ర్దుకొని సినిమాల‌న్నీ వెళ్లిపోతున్నాయి. కానీ ఏపీ ప్ర‌భుత్వం 1980, 1990 కాలంనాటి ప‌రిస్థితుల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా చూపిస్తూ సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్లో విక్ర‌యించాల‌నుకోడం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని సినిమా రంగానికి చెందిన విశ్లేష‌కులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: