క‌రోనా వైర‌స్‌లో ఉధృతంగా వ్యాప్తిచెందుతోన్న డెల్టా ర‌కం గురించి ప‌రిశోధ‌కులు ఒక కొత్త విష‌యాన్ని వెల్ల‌డించారు. టీకాలు తీసుకున్న‌వారు కూడా డెల్టా బారిన ప‌డుతున్నార‌ని, అయితే శ‌రీరంలో ఈ ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌ర‌గా త‌గ్గిపోతుంద‌ని బ్రిట‌న్‌కు చెందిన ప‌రిశోధ‌కులు తెలిపారు. ఇళ్ల‌ల్లో క‌రోనా ర‌కం ఎక్కువ‌గా వ్యాప్తిచెందుతోంద‌ని, డెల్టా ఇళ్ల‌ల్లో వ్యాప్తి చెందుతోంద‌న్న‌దానికి స‌రైన ఆధారాలు లేన‌ప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డానికి టీకాలు పొంద‌డం ఒక్క‌టే స‌రైన మార్గ‌మ‌ని చెబుతున్నారు. టీకా తీసుకున్న‌వారిలో ఇన్‌ఫెక్ష‌న్ త్వ‌ర‌గా న‌య‌మ‌వుతున్న‌ప్ప‌టికీ వైర‌ల్ లోడు మాత్రం ఇత‌రుల‌తో స‌మానంగా ఉంటోంద‌న్నారు. వీరిద్వారా ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు వ్యాపిస్తోంద‌ని, అయితే ఇళ్ల‌ల్లో డెల్టా ర‌కం వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి టీకాలు ఒక్క‌టే స‌రిపోవ‌ని త‌మ అధ్య‌య‌నం ద్వారా తేలిన‌ట్లు చెప్పారు. టీకా వేయించుకోనివారితో పోలిస్తే టీకా తీసుకున్న‌వారిలో డెల్టా వ్యాప్తి త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిర్థార‌ణైంద‌న్నారు. క‌రోనా వైర‌స్ ర‌కాల్లో డెల్టా ఒక్క‌టే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, దీన్ని నిరోధించ‌డానికి క‌చ్చితంగా టీకాలు తీసుకోవ‌డ‌మొక్క‌టే ప్ర‌స్తుతానికి ప‌రిష్కార‌మ‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: