ఏపీలో సీఎం సొంత జిల్లా లోని బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్ని క ఓట్ల లెక్కింపు ఈ రోజు జ‌రిగింది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ మైన ఈ ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. వైసీపీ క్యాండెట్ డాక్ట‌ర్ దాస‌రి వెంక‌ట సుధ 90089 ఓట్ల భారీ మెజార్టీ తో ఘ‌న విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి సుధ కు 111710 ఓట్లు వ‌చ్చాయి. పోలైన ఓట్ల‌లో 85 శాతం ఓట్లు వైసీపీ కే ప‌డ్డాయి. ఇక బీజేపీ అభ్య‌ర్థి ప‌న‌త‌ల సురేష్ కు 21621 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ వాళ్ల‌కు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మాజీ ఎమ్మెల్యే క‌మ‌ల మ్మ‌కు కూడా ఊహించ‌ని  విధంగా 5 వేల ఓట్లు వ‌చ్చాయి. ఇక వైసీపీ బంప‌ర్ విక్ట‌రీ కొట్టేసింది. ఇదిలా ఉంటే వైసీపీ దొంగ ఓట్ల తో గెలిచింద‌ని బీజేపీ అభ్య‌ర్థి సురేష్ ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: