మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రి త‌రువాత న‌ట‌న‌లో జోరును పెంచారు.  రీ ఎంట్రీ తర్వాత ఖైదీ 150 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు చిరంజీవి. ఆ త‌రువాత‌ హిస్టారికల్ సినిమా సైర న‌ర్సింహారెడ్డితో మ‌రో  విజ‌యాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో గుణపాఠాలు చెప్పడానికి రెడీ అవుతున్నారు.  కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న‌ది.  ఇక ఈ చిత్రంలో చిరంజీవి , రామ్ చరణ్ ఇద్ద‌రూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా త‌రువాత వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చిరు క్యూలో  పెట్టారు. వీటిలో మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేసారు.  తమిళ్ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  అదేవిధంగా  మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో  వేదాళం సినిమా రీమేక్ భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవికి  చెల్లెలుగా అందాల భామ కీర్తిసురేష్ నటించ‌నుంది. ఈ రెండు సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో కూడ ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. దీపావళి కానుకగా ఇవాళ  ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ను అందించారు మూవీ మేకర్స్ . ఈ సినిమాలో మెగాస్టార్ మాస్ లుక్ లో చూప‌రుల‌ను ఆక‌ట్టుకున్నారు.  ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు న‌వంబ‌ర్ 6న  ఉదయం 11.43 కు లాంఛ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇక అదే రోజున ఈ చిత్రం నుంచి చిరు లుక్ ను కూడా రివీల్ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఈ మ‌ధ్య‌కాలంలో కుడిచేతి మ‌ణిక‌ట్టుకు స‌ర్జ‌రీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల పాటు రెస్ట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మొత్తానికి ర‌ప్పాడించ‌డం ప్రారంభించాడు. చేయి నొప్పి కార‌ణంగానే లూసిఫ‌ర్ రీమెక్ షూటింగ్‌కు విరామం ప్ర‌క‌టించాడు మెగాస్టార్‌. అదేవిధంగా న‌వంబ‌ర్ 06  
మధ్యాహ్నం 12. 06కు మూలవిరాట్ దర్శనం చేయిస్తానని హామి ఇచ్చాడు దర్శకుడు రవీంద్ర.  మొత్తానికి చిత్రం ప్రారంభం రోజున‌నే చిరంజీవి ఫస్ట్ లుక్ విడుద‌ల కాబోతుంద‌న్న మాట. మెగాస్టార్‌ నటిస్తున్న 154వ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: