తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌పై ప్ర‌తాపం చూపిస్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై, వ‌రికొనుగోళ్ల‌పై జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలుగా ఏర్ప‌డి ప‌ర్య‌ట‌న చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు రేవంత్‌.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిస్థాయిలో ప‌న్నుల‌ను పెంచి ఒక ర‌కంగా దోపిడి దొంగ‌లుగా మారాయ‌ని ఎద్దేవా చేశారు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్న‌ట్టు  వెల్ల‌డించారు. అదేవిధంగా తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కార్య‌చ‌ర‌ణ రూపొందించామ‌ని తెలిపారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైర‌న్‌పై కార్య‌చ‌ర‌ణ రూపొందించాం అని వివ‌రించారు. ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి  తెలంగాణ సీఎం కేసీఆర్ కొనాల‌నుకుంటున్నార‌ని రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హ‌మ‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: