పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లను త‌గ్గించాల‌ని చంద్ర‌బాబు ధ‌ర్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చేయ‌డం కాదు.. ద‌మ్ముంటే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేయాల‌ని  తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం మున్సిపాలిటీని కూడా గెలిచే దమ్ము చంద్రబాబు కి లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇష్టానుసారంగా  పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచిన‌ప్పుడు చంద్ర‌బాబుకు సోయి లేదా అని ప్ర‌శ్నించారు.

 ఇప్ప‌టికే కేంద్రం 3 లక్షల 45 వేల కోట్లు ప్రజా ధనాన్ని తీసుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కుప్పం లో మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో గెలవలేక చంద్రబాబు దొంగ ఏడుపులు  ఏడుస్తున్నాడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు నాగేశ్వ‌ర్‌రావు. కుప్పంలో అస‌లు చంద్ర‌బాబుకు ఇల్లు లేద‌ని, కార్య‌క‌ర్త‌ల ఇంట్లో ఉండ‌లేక బ‌స్సుల్లో రాజ‌కీయాలు చేస్తున్నందుకు సిగ్గు ప‌డు చంద్ర‌బాబు అని చుర‌క‌లు అంటించారు. పెట్రోల్‌, డీజిల్ పై కేంద్రం ఇంత‌కు రోజు రేట్ల‌ను పెంచిన‌ప్పుడు ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు అని అడిగారు. కేవ‌లం రూ.5 నుంచి 10 వ్యాట్ త‌గ్గించ‌గానే అడుగుతున్నారు. రూ.73 నుంచి రూ.118 వ‌ర‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని, అది ఎందుకు గుర్తుకు రాలేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు కారుమూరి నాగేశ్వ‌ర్‌రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: