భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం రాత్రి ఒంటిగంట స‌మ‌యంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన విష‌యం విధిత‌మే. ఈ విష‌యం తెలుసుకున్న నూత‌న వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ట్విట్ట‌ర్ వేధిక‌గా క‌లెక్ట‌ర్ దంప‌తుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.


సీఎం కేసీఆర్ నాయ‌త్వంలో ప్ర‌భుత్వ ద‌వ‌ఖాన‌లు అధునూత‌న సౌక‌ర్యాల‌తో మెరుగైన సేవ‌లందిస్తున్నాయి అని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లోనే వైద్యం చేయించుకునేందుఉ ఉత్స‌హంగా ముందుకు వ‌స్తున్నార‌ని మంత్రి వివ‌రించారు. అందుకు నిద‌ర్శ‌నం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్ అనుదీప్‌ భార్య మాధవి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవ‌డ‌మే అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిల‌పై ప్ర‌జ‌ల‌లో న‌మ్మ‌కం క‌ల్పించేందుకే క‌లెక్ట‌ర్ ఇలా చేసార‌ని మంత్రి చెప్పారు. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ స్నేహ‌ల‌త కూడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కాన్పు చేయించుకున్న‌ట్టు వెల్ల‌డించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: