ఖ‌రీఫ్ సీజ‌న్‌లో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్  పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధ‌ర్నాలు నిర్వ‌హించారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్, సిద్దిపేట జిల్లాలో హ‌రీశ్‌రావు ధ‌ర్నాలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయంలో ఎన్నో రికార్డుల‌ను సృస్టించ‌ద‌ని  పేర్కొన్నారు కేటీఆర్‌. 24 గంట‌లు క‌రెంట్ తెచ్చిన ఘ‌న‌త కేసీఆర్ దే  అని చెప్పారు.   తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత అతిత‌క్కువ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశం అబ్బూర ప‌డే విధంగా ఏడు ద‌శాబ్దాల దుష్ప‌రిణామాల‌ను మ‌రిపించే విధంగా 24 గంట‌లు క‌రెంట్ తీసుకొచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కిన‌ది.

 రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుద‌నే ఆలోచ‌న ఉంటే త‌ప్ప‌కుండా మంచి జ‌రుగుతుంది. గ‌తంలో ఎప్పుడు చూసిన క‌రువు ఉంటుండే. ఒక ముఖ్య‌మంత్రి ఉన్న‌ప్పుడు ఏడేండ్లు వ‌రుస క‌రువు అని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ముఖ్య‌మంత్రి వ‌చ్చాక ఏడేండ్ల‌లో క‌రువు కాట‌కాలు వ‌చ్చాయా అని గుర్తు చేసుకోవాలి. పరిపాలించిన వారి మ‌న‌సు బాగుంటే వాతావ‌ర‌ణం కూడ స‌హ‌క‌రిస్తుంటుంది.  దేశంలో ఎవ‌రు కొనుగోలు చేయ‌న‌ప్పుడు  ముందే యూరియా, విత్త‌నాలు  తెప్పించి బ‌ఫర్ స్టాక్ సిద్ధం చేసి మార్కెట్‌ల‌లో ప్ర‌భుత్వం సిద్ధం చేసిన‌ద‌ని తెలిపారు. ఏడేండ్ల‌లో విత్త‌నాల కోసం యుద్ధాలు లేవు, ఎరువు కోసం వీధి పోరాటాలు లేవు. చెరువుల‌కు పూర్వ‌వైభ‌వం తెచ్చే విధంగా రూ.20వేల కోట్లు ఖ‌ర్చు చేసి మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువుల‌ను బాగు చేసుకున్నం అని గుర్తు చేశారు. తెలంగాణ ప‌థ‌కాలు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర ప్ర‌భుత్వం కాపీ కొట్టింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: