కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు తిరుపతి పర్యటనకు వస్తున్న నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. పలు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను సదరన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అమిత్ షా మూడు రోజుల తిరుపతి పర్యటన ఖరారు అయినట్టుగా కేంద్ర హోం మంత్రి కార్యాలయం తెలిపింది. 13న రాత్రి తిరుపతిలో బస చేస్తారు అని వెల్లడించారు.

14 ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు అని 14మధ్యాహ్నం నుంచి తిరుపతి లో సదరన్ జోనల్ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని రాత్రి తిరుమల లో బస చేస్తారు అన్ని శ్రీవారి దర్శనం చేసుకొని 15న తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు వివరించారు. అయితే ఈ సమావేశానికి ఏపీ సిఎం వైఎస్ జగన్ హాజరు అవుతారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: