మహారాష్ట్రలోని గడ్చిరోలి లో శనివారం పోలీసులు మరియు నక్సల్ మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో నక్సల్‌ మరణించారు. ఈ విషయాన్నీ మహారాష్ట్ర పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. ముంబై రాష్ట్రానికి సుమారు 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యారబట్టి అటవీప్రాంతంలోని దనోర సమీపం లో శనివారం ఉదయం పోలీసు సిబ్బందిపై అల్ట్రాలు ఫైరింగ్ జరిపారు. దానికి ప్రతీకారంగా పోలీసులు నక్సల్స్ పై ఎదురు కాల్పులు జరిపినట్లు తెలుస్తూవుంది.పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు దాదాపు 5 గురు నక్సల్స్ హతమయ్యారని పోలీస్ అధికారులు తెలిపారు... ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతూ ఉంది.




ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర లో గత కొంత కాలంగా నక్సల్స్ మరియు పోలీసులమధ్య దాడులు ప్రతి దాడులు జరుగుతూ ఉన్నాయ్. ఇదిలావుండగా శనివారం రోజున మావోయిస్టు టెక్ రవి చనిపియినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. కమిటీలో కీలకంగా ఉన్న నేత చనిపోయాడని తెలియడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తాజాగా ఈ విషయాన్నీ ఝార్ఖండ్ పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటనతో టెక్ రవి చనిపోయాడని గత సంవత్సర కాలంగా వస్తున్న వార్తలకు తెర పడింది


మరింత సమాచారం తెలుసుకోండి: