గత శనివారం మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా గ్యారబట్టి లో హోరాహోరీ గా ఎన్‌కౌంటర్‌  జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ అధికారులకు మరియు మావో లకు జరిగిన భీకర తుపాకీ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన 26 మంది లో నలుగురు మహిళా మావో లు ఉండటం విశేషం. అయితే ఈ విషయమై మావో లు పొలిసు ఇంఫోర్మర్లు గా అనుమానించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరివేసి చంపారు.


అంతే కాకుండా ఒక పోస్టర్ ని కూడా ఆ ఇంటి బయట అంటించి వెళ్లారు కూడా. ఈ ఎన్‌కౌంటర్‌  లో మరణించిన మృతులలో మావో కీలక నేతలు ఉండటం గమనార్హం. గడ్చిరోలి జిల్లా లో తాజాగా చేసిన కూంబింగ్ గ్రూప్ కి మరో నేత మృత దేహం లభ్యమయ్యింది . వెంతనే మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. గడ్చిరోలి గ్యారపట్టి లో లభించిన మృతుల సంఖ్యా 27 కి చేరుకుంది.

లభించిన మృతదేహానికి సంబందించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. తాజాగా లభించిన మావో జహాల్ నక్సలైట్ నాయకుడు సుఖ్‌లాల్ గా వారు గుర్తించారు. సుఖ్‌లాల్ మరణించినట్లు పోలీసులు ప్రకటన విడుదలచేశారు. అతడు దండకారణ్య జోనల్ సభ్యుడు అయినటువంటి సుఖ్‌లాల్ పై గతంలో 25 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు వారు ప్రకటించారు. సుఖ్‌లాల్ మృతదేహాన్ని స్వాధీనపరచుకొనే సమయం లో అక్కడ ఉన్న ఓ గ్రామా సాయుధుడిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: