ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎన్‌.ఆర్ మ‌నోహ‌ర్ (61), బుధవారం చెన్నైలోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో క‌న్నుమూసారు. దాదాపు  ఇర‌వై రోజుల నుంచి ఆయ‌న ఆ ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కోవిడ్‌-19 కార‌ణంగా మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ లో చేరారు.  బుధ‌వారం గుండెపోటుతో ఆర్ ఎన్ ఆర్ మ‌నోహ‌ర్‌ మృతి చెందారు.

మ‌నోహ‌ర్ త‌మిళ చిత్రాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. కొళంగ‌ల్‌, దిల్‌, తెన్న‌వాన్‌, వీర‌మ్‌, స‌లీమ్‌, ఎన్నై అరిందాల్‌, నానుమ్ రౌడిదాన్‌, వేదాలం, విశ్వాసం, కాంఛ‌న‌-3, అయోగ్య వంటి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌ల విడుద‌ల అయిన ఆర్య టెడ్డీ చిత్రంలో హీరోయిన్ సాయేషా సైగ‌ల్ తండ్రిగా ఆయ‌న న‌టించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉన్న విశాల్ సామాన్యుడు సినిమాలో మ‌నోహ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. న‌కుల్‌, సునైనా న‌టించిన మాసిల‌మ‌ణి చిత్రంను ఆర్ఎన్ఆర్ మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నంద‌, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన యాక్ష‌న్ డ్రామా వెల్లూర్ మావ‌ట్ట‌మ్ చిత్రానికి కూడా  ద‌ర్శ‌కుడు మ‌నోహ‌రే. ఆర్ఎన్ఆర్ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: