గ‌త కొద్ది రోజుల కాలం నుంచి  తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలుపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య వివాదం కొన‌సాగుతున్న విష‌యం విధిత‌మే. వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రాన్ని అడుగుతుంటే కేంద్రం మాత్రం ఉలుకు లేదు ప‌లుకు లేద‌ని టీఆర్ఎస్ మండిప‌డుతున్న‌ది. ఈ త‌రుణంలోనే కేంద్ర ప్ర‌భుత్వం యొక్క తీరుకు నిర‌స‌న‌గా ఇందిరాపార్కు వ‌ద్ద టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నా చేప‌డుతొంది.
 
టీఆర్ఎస్ ధ‌ర్నాలో ఓ అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్ప‌టికీ ఆయ‌న స్టేజ్ పైకి మాత్రం వెళ్ల‌లేదు. మామూలు కార్య‌క‌ర్త‌లాగా జ‌నం మ‌ధ్య‌లో కూర్చుని త‌న నిర‌స‌న తెలియ‌జేశారు కేటీఆర్‌. ముఖ్యంగా కేసీఆర్ కూతురు క‌విత, అల్లుడు మంత్రి హ‌రీశ్‌రావులు స్టేజ్ ఎక్కిన‌ప్ప‌టికీ.. మంత్రి కేటీఆర్ మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండి నిర‌స‌న చేప‌ట్టారు. తెలంగాణ ఉద్య‌మ కాలాన్ని గుర్తు చేసే విధంగా కేటీఆర్ వ్య‌వ‌హ‌రించారు. తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో   ఈ అరుదైన ఘ‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: