విధి ఎవ్వ‌రినీ విడిచి పెట్ట‌దు అని, అంద‌రి స‌రదా తీర్చేస్తుంద‌ని, చంద్ర‌బాబుకు ఇప్పుడు అదే జ‌రిగింద‌ని న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఆక‌స్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు. 72 ఏండ్ల వ‌య‌స్సులో ఎన్టీఆర్‌ను ఎంత ఏడిపించారో గుర్తుకు ఉందా అంటూ ప్ర‌శ్నించారు. అదే వ‌య‌స్సులో ఇప్పుడు 71 సంవ‌త్స‌రాల 7 నెల‌ల‌కు చంద్ర‌బాబు ఏడ్చార‌ని.. మ‌నం ఏది చేస్తే అది మ‌నకు తిరిగి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. గ‌తంలో హైద‌రాబాద్ అసెంబ్లీలో నాపై నీవు చేసిన కామెంట్స్ నీకు గుర్తుకు ఉన్నాయా చంద్ర‌బాబు అంటూ మండిప‌డ్డారు రోజా.
 
ఆ రోజు నీవు ఎవ‌రి మీద ఎలాంటి కామెంట్లు చేసావో అంతా గుర్తించుకున్నార‌ని పేర్కొన్నారు. ఎవ‌రో ఏదో అన్నార‌ని దొంగ ఏడుపులు ఏడ్చేస్తున్నార‌ని ఎద్ద‌వా చేశారు రోజా. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌ధాని మోడీతో స‌హా ఎన్ని మాట‌లు మాట్లాడావో తెలుసు అని తెలిపారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంద‌ని.. బైబై బాబు అంటూ రోజా ఓ వీడియోను విడుద‌ల చేసారు. ఇప్పుడు రోజా విడుద‌ల చేసిన వీడియో సంచ‌ల‌నం అవుతొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: