ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చిత్తూరు, ప్ర‌కాశం, నెల్లూరు, అనంత‌పురం, ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో పింఛ‌, అన్న‌మ‌య్య జ‌లాల న‌దులు ఆనక‌ట్ట‌లు తెగిపోయాయి. క‌డ‌ప‌- చెన్నై ర‌హ‌దారిపై భారీగా వ‌ర‌ద నీరు చేరింది. నిన్న‌టి నుంచి రాక‌పోక‌లు బంద్ అయ్యాయి. కిలోమీట‌ర్ల వ‌ర‌కు వాహ‌నాలు నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా రాజంపేట, నంద‌లూరు మండ‌లాల ప‌రిధిలో 30 మందికి పైగా గ‌ల్లంతు అయ్యారు. ఇప్ప‌టికే 12 మృత‌దేహాల‌ను వెలికి తీసారు. ప‌శువులు, గేదెలు, కోళ్లు నీటిలో కొట్టుకుపోయాయి.  

జాతీయ ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు భారీగా ప్ర‌వ‌హిస్తోంది. వేలాది ఎక‌రాల్లో పంట‌ల‌కు తీవ్రంగా న‌ష్టం వాటిల్లింది. విద్య‌త్ స‌ర‌ఫ‌రా దాదాపు అంత‌టా నిలిచిపోయింది. వ‌ర‌ద ఉధృతిలో ముంబై- చెన్నై రైలు మార్గంలో   రాజంపేట మండ‌లం హ‌స్త‌వ‌రం-నంద‌లూరు మ‌ధ్య రైలు ప‌ట్టాలు రెండు వ‌రుస‌లు కొట్టుకుపోయాయి. క‌డ‌ప‌- రేణిగుంట జాతీయ ర‌హ‌దారిని చెయ్యేరు న‌ది నీరు ముంచేసిన‌ది. గుండ్లూరు, చొప్ప‌వారిప‌ల్లె, రామాపురం మ‌ధ్య‌లో రోడ్డు అంతా జ‌ల‌మ‌యం కావ‌డంతో మూడు బ‌స్సులు నీటిలో చిక్కుకున్నాయి. రేణిగుంట‌, క‌డ‌ప జాతీయ ర‌హ‌దారి వంతెన పై పెద్ద రంద్రం ప‌డ‌డంతో ప్ర‌మాద‌క‌రంగా లారీ నిలిచిపోయిన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: