రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు వేడి ఎక్కాయి. ఈరోజు రాజ‌స్థాన్ కొత్త మంత్రి వ‌ర్గం కొలువు దీర‌నున్న‌ది. సాయంత్రం 4 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో కొత్త మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు. సీఎం త‌ప్ప మిగ‌తా మంత్రి వ‌ర్గమంతా ఇప్ప‌టికే రాజీనామా చేసారు. శాస‌న‌స‌భ‌లో 200 మంది స‌భ్యుల సంఖ్య ప్ర‌కారం.. క్యాబినెట్‌లో గ‌రిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవ‌కాశముంది. పార్టీ హై క‌మాండ్ ఇచ్చిన హామీ మేర‌కు సీనియ‌ర్ నేత స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప్ర‌ధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

పైల‌ట్ టీమ్‌కు మెజార్టీ పోర్టు పోలియోలు ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. రెవెన్యూ మంత్రి హ‌రీశ్ చౌద‌రీ, వైద్యారోగ్య‌శాఖ మంత్రి ర‌ఘుశ‌ర్మ‌, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్‌లు క్యాబినెట్ నుంచి త‌ప్పుకునేందుకు ఇప్ప‌టికే ఒప్పుకున్నారు. మంత్రి గోవింద్ సింగ్ రాజ‌స్థాన్ పీసీసీ అధ్య‌క్షునిగా ఉండ‌గా, మిగ‌తా ఇద్ద‌రిలో ర‌ఘుశ‌ర్మ‌, హ‌రీశ్‌చౌద‌రీ గుజ‌రాత్‌, పంజాబ్ పార్టీ వ్య‌వ‌హారాల బాధ్యులుగా నియ‌మితులు అయ్యారు. పైల‌ట్ వ‌ర్గానికి 12 మంత్రి ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ ఉన్నాయంటూ కాంగ్రెస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గ‌త కొద్ది కాలం నుంచి సీఎం గెహ్ల‌ట్‌, పైల‌ట్‌కు మ‌ధ్య విభేదాలు త‌లెత్తుతున్నాయి. అయితే పైల‌ట్ తిరుగుబాటు చేయ‌డంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో సంక్షోభం నెల‌కొంది. రాహుల్ గాంధీ చొరువ‌తో స‌మ‌స్య స‌ద్దుమ‌నిగింది. లేకుంటే సింధియా మాదిరిగానే పైల‌ట్ కూడ పార్టీ అవ‌కాశం క‌నిపించింది.







మరింత సమాచారం తెలుసుకోండి: