పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు స‌ర్వ‌ర్ లోపం ఒక‌టి భారీగానే బ‌య‌ట‌ప‌డి వెలుగులోకి వచ్చింది. ఈ లోపంమూలంగా సుమారు ఏడు నెల‌ల పాటు త‌న 18 కోట్ల వినియోగ‌దారుల వ్య‌క్తి గ‌త ఆర్థిక స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చిన‌ట్టు సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ సైబ‌ర్ ఎక్స్‌-9 వెల్ల‌డించింది. బ్యాంకుకు సంబంధించిన డిజిట‌ల్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవ‌కాశాన్ని సర్వ‌ర్ లోపం క‌ల్పించిన‌ట్టు ఆ సంస్థ పేర్కొన్న‌ది.

ఇంత‌లోనే బ్యాంకు ఈ లోపం గురించి ధృవీక‌రించిన‌ది, కానీ దుర్భ‌ల‌త్వం కార‌ణంగా కీల‌క‌మైన డేటా బ‌హిర్గ‌తం కాలేద‌ని వెల్ల‌డించింది. దీని కార‌ణంగా క‌స్ట‌మ‌ర్ల డేటా, ప్ర‌భావితం కావ‌ని.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా స‌ర్వ‌స్ ష‌ట్‌డౌన్ చేసిన‌ట్టు పీఎన్‌బీ తెలిపింది. గ‌త 7 నెలలుగా 180 మిలియ‌న్ల‌కు పైగా ఖాతాదారుల నిధులు, వ్య‌క్తిగ‌త ఆర్థిక వివ‌రాలు, న‌గ‌దు విష‌యంలో పంజాబ్ నేష‌న‌ల్‌ బ్యాంకు రాజీ ప‌డింది. సైబ‌ర్ ఎక్స్‌-9 ఈ లోపం క‌నుగొన్న త‌రువాత సీఈఆర్‌టీ-ఇన్, ఎన్‌సీఐఐపీసీ సాయంతో పీఎన్‌బీకీ వివ‌రించ‌డంతో బ్యాంకు మేల్కొని లోపాన్ని ప‌రిష్క‌రించింద‌ని సైబ‌ర్ ఎక్స్‌9  వ్య‌వ‌స్థాప‌కుడు హిమాన్ష్ పాఠ‌క్ వెల్ల‌డించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: