గుర్తు తెలియని ముష్కరులు సోమవారం భారత సైనికులపై గ్రెనేడ్ దాడి చేశారు. పఠాన్ కోట్ వద్ద ఆర్మీ క్యాంప్ మొదటి గేట్ త్రివేణి ద్వారం వద్ద ఈ దాడి జరిగింది. ఇక్కడి రహదరి పై వెళుతున్నపెళ్లి ఊరేగింపు లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు భారత సైనికుల పైకి గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటన లో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న వెంటనే పంజాబ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రెనేడ్ తాలూకూ శేషాలను ఏరి పారేశారు. అవుట్ పోస్టులను కట్టుదిట్టం చేశారు. పెళ్లి ఊరే గింపులో పాల్గోన్న వారెవరు అన్న విషయం పై పోలీసులు శోదనలు చేస్తున్నారు. సిసిటివి పుటేజ్ లను పరిశీలించి ముష్కరులను అదుపులోనకి తీసుకుంటామని సైనిక, పోలీసు అధికారులు తెలిపారు.
పఠాన్ కోట్ లోని భారత సైనిక స్థావరం పై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు.  2016 జనవరి 2 వ తేదే పాకిస్తాన్ కు చెందిన ఆరుగురు తీవ్రవాదాలు దాడులు చేశారు. ఆ రోజు ఆ తీవ్రవాదులు పంజాబ్ లోని కథువా- గురుదాస్ పూర్  సరిహద్దు  గుండా భారత్ లోకి ప్రవేశించారు. భారత సైనికులుపై మూడు రోజుల  కాల్పులు జరిపారు ఈ ఘటనలో  తీవ్రవాదులుఅందరూ మృతి చెందగా, భారత్ కు చెందిన ఏడుగురు సైనికులు  ఈ భీకర పోరులో అశువులు బాసారు.

 పఠాన్ కోట్ హిమాలయ  పర్వత శ్రేణువులకు ముఖ ద్వారంగా ఉంటుంది. అక్కడి వాతా వరణం మనసుకు ఆహ్లాదం కలిగించేదిగా ఉంటడం తో నిత్యం పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.  ఇక్కడ భారత  సైనికులు నిత్యం పహరా కాస్తుంటారు. తాజాగా సైనికులపై గ్రెనేడ్ దాడి జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: