ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టించిన మూడు రాజ‌ధానుల అంశం ఇవాళ హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజ‌ధానుల అంశాన్ని స‌వాల్ చేస్తూ హై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కావ‌డంతో హై కోర్టు విచార‌న చేప‌ట్టింది. వాదోప‌వాద‌న‌లు విన్న హై కోర్టు విచార‌ణ‌ను ఇవాళ‌కు వాయిదా వేసింది. అయితే ఈరోజు హై కోర్టు ఈ విష‌యంపై విచార‌ణ చేప‌ట్ట‌గా.. మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు అడ్వ‌కేట్ జ‌న‌రల్ కోర్టులో వెల్ల‌డించారు.

అసెంబ్లీలో దీని కోసం ఓ కొత్త చ‌ట్టం తీసుకొస్తున్నా తెలుస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా.. ఏపీ క్యాబినెట్ ఇవాళ  స‌మావేశం నిర్వ‌హించ‌గా, అసెంబ్లీ స‌మావేశాల‌కు మంత్రులు ఒక్క‌క్క‌రూగా హాజ‌ర‌య్యారు. అసెంబ్లీ వ‌ద్ద‌కు చేరుకున్న మంత్రి కొడాలి నానిని మీడియా ప్ర‌శ్నించింది.  సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకున్నాక ఆ నిర్ణ‌యానికి మేమందరం క‌ట్టుబ‌డి ఉంటాం అని స్ప‌ష్టం చేసారు. టెక్నిక‌ల్ గా కోర్టుకు పోయి ర‌క‌ర‌కాలుగా అంశాలు జ‌రుగుతున్నాయ‌ని, దానిపై ఏమి చేయాలో క్యాబినెట్ లో చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. అందుకు అనుగుణంగానే సీఎం జ‌గ‌న్  సంచ‌ల‌న నిర్ణ‌యం  తీసుకున్నార‌ని స‌మాధానం చెప్పారు.  రాజ‌ధానుల బిల్లు మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టి శాస‌న మండ‌లి అనుమ‌తి అధికారికంగా తీసుకుంటారా అని అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం కొడాలి నాని స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. ఏది ఏమైనా సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై ఎంతో ఆస‌క్తి నెల‌కొన్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: