ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌ల‌సీమ ప్రాంతంలో క‌రువు కాట‌కాల‌తో.. తాగు నీటి కోస‌మే యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది. నేడు వ‌ర‌ద‌ల సుడిగుండంలో చిక్కుకుని ఆ ప్రాంతం అంతా అల్లాడిపోతున్న‌ది. వారం రోజుల పాటు క్ష‌ణ క్ష‌ణం ఒక యుగంలా గ‌డిపివేసింది. వ‌రణుడికి బీపీ వ‌చ్చి ఏపీని వ‌ణికించిన‌ట్టు గ‌డ‌గ‌డ‌లాడిపోయిన‌ది. ప్ర‌స్తుతం వ‌రుణుడు శాంతించినా కానీ వ‌ర‌దల నుంచి ఇంకా కోలుకోలేదు ఆ ప్రాంతం.  వరద మిగిల్చిన బురద అలాగే  ఉన్న‌ది.

 ఆ బురదలోనే జనం నానుతూ.. ఇబ్బందులు ఎదుర్కుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ఇంకా తేరుకోకముందే  మరో ముప్పు ముంచుకొస్తున్న‌ది. రాబోయే  24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్న‌దని వాతావరణ శాఖ ప్రకటించిన‌ది.  శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచెనా  వేస్తుంది వాతావ‌ర‌ణ శాఖ‌. బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని ఇప్ప‌టికే హెచ్చరికలు జారీ చేసింది.  ముఖ్యంగా దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  తమిళనాడుపై ఈ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుందని,  చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశముంద‌ని అంచెనా వేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: