కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీకి 200 మంది పోలీసులు బందోబ‌స్తు ఉంటే.. ఇవాళ దాదాపు 400 మంది రెట్టింపుగా భారీ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. నాట‌కీయ‌, రాజ‌కీయ ఆవేశాలు మ‌ధ్య‌న కొండ‌ప‌ల్లి ఖిల్లాకు చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొని ఉంది. లోప‌ల నుంచి వ‌చ్చిన వీడియోలు హ‌ల్ చ‌ల్ సృష్టిస్తున్నాయి. లోప‌లికి మొబైల్ అనుమ‌తించ‌డం లేదు. నిన్న వీడియోలు లీక‌వ్వ‌డంతో ఇవా ళ‌ ఎన్నిక‌ల అధికారులు క్షుణ్ణంగా ప‌రిశీలించి లోప‌లికి పంపిస్తున్నారు.

ఎవ‌రెన్ని ప్ర‌లోభాలు పెట్టినా టీడీపీ మాత్రం గెలుపు మాదే అనే ధీమా వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టికే దేవినేని ఉమా ప్ర‌క‌టించారు. కేశీనేని ఎంపీ మాట్లాడుతూ నిన్న అంద‌రం 15 మంది వార్డు మెంబ‌ర్లు, ఎంపీ కేశీనేనితో క‌లిసి ఓటు వేయ‌డానికి వెళ్లామ‌ని చెప్పారు. స‌బ్ మిట్ చేయాల్సిన ఫామ్స్ చేసిన త‌రువాత హై కోర్టు ఆదేశాల మేర‌కు నిన్న జ‌రిగిన ప్రొసీడింగ్ పూర్తి చేసి హైకోర్టు ఆదేశాల మేర‌కు ఆర్ ఓ గారు సిద్ధం చేస్తుండ‌గా.. వైసీపీ వార్డు స‌భ్యులు ధ్వంసం చేసారని ఎంపీ వెల్ల‌డించారు.  ఓటు వేసిన త‌రువాత కోర్టు తుది తీర్పు ఇస్తుంద‌ని.. ఇప్ప‌టికే ఆర్డ‌ర్ ఇచ్చిన‌దని ఎంపీ స్ప‌ష్టం చేసారు. వైసీపీ నేత‌లు కోర్టు దిక్కార చ‌ర్య‌కు పాల్ప‌డుతున్నారు. టీడీపీ 15 మంది, వైసీపీ 14 మంది గెలిచారు. గెలుపును మాత్రం హై కోర్టు డిసైడ్ చేస్తుంది  అని  స్ప‌ష్టం చేశారు. అధికార పార్టీ కావాల‌నే అడ్డంకులు, గొడ‌వ‌ల‌కు సృష్టిస్తుంది. గొడ‌వ‌లు జ‌రుగ‌కుండా ఇప్ప‌టికే పోలీసులు బారీ బ‌లగాల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్ప‌టికే వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌ర‌గుతుంది. మున్సిప‌ల్ ఎదుట హై టెన్ష‌న్ వాతావ‌రణం నెల‌కొని ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: