గాల్వాన్‌లో వీర‌మ‌ర‌ణం పొందిన త‌రువాత క‌ల్న‌ల్ సంతోష్‌కు మ‌హావీర్ చ‌క్ర పుర‌స్కారం రాష్ట్రప‌తి అందించారు. రాష్ట్రప‌తి చేతుల భార్య సంతోషి, త‌ల్లి అందుకున్నారు. క‌ల్న‌ల్ సంతోష్ సొంతూరు సూర్య‌పేట. ఇప్ప‌టికే సూర్య‌పేట‌లో క‌ల్న‌ల్ సంతోష్ విగ్ర‌హాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి తెలంగాణ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ముఖ్యఅతిథిగా హాజ‌రై ఆవిష్క‌రించిన విష‌యం విధిత‌మే.

గాల్వాన్‌లో వీరోచితంగా పోరాడి వీర‌మ‌ర‌ణం పొందిన‌ సంతోష్ బాబుకు  మ‌హావీర్ చ‌క్ర పుర‌స్కారమును రిపబ్లిక్ డే సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఈ అవార్డును యుద్ధ స‌మ‌యంలో అత్యంత ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించే సైనికుల‌కు అందించే రెండ‌వ అత్యున్న‌త పుర‌స్కార‌మే మ‌హావీర్ చ‌క్ర. అత్యంత ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన సైనికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌ర‌మ‌వీర చ‌క్ర‌, మ‌హావీర‌చ‌క్ర వంటి పుర‌స్కారాల‌తో స‌త్క‌రిస్తుంటుంది. వీటితో పాటు అశోక్‌చ‌క్ర‌, కీర్తిచ‌క్ర‌, సూర్య చ‌క్ర వంటి పుర‌స్కారాల‌ను, శౌర్య పుర‌స్కారాలను అంద‌జేస్తుంటుంది కేంద్ర ప్ర‌భుత్వం. ఇక సంతోష్‌బాబుకు మ‌హావీర్ చ‌క్ర అవార్డు రావ‌డం గొప్ప విష‌యం అని క‌ల్న‌ల్ భార్య సంతోషి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: