ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక ఉత్కంఠ‌, ఉద్రిక్త‌త మ‌ధ్య కొన‌సాగుతుండ‌గానే తొలుత వైసీపీ నేత‌లు అడ్డుకున్నారు. ఆ త‌రువాత టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకున్న‌ది. ఈ వాగ్వాదం చోటు చేసుకున్నా ఎన్నిక మాత్రం జ‌రిపించాల‌ని టీడీపీ ప‌ట్టుప‌డుతోంది. అయితే ఆర్వో మాత్రం సోమ‌వారం వాయిదా వేసిన‌ట్టే ఇవాళ కూడా మ‌రోసారి వాయిదా వేస్తున్నట్టు ఆర్వో ప్ర‌క‌టించారు.

ఓవైపు వైసీపీ ఎన్నిక‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రోవైపు ఎలాగైనా ఎన్నిక నిర్వ‌హించి చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను ఎన్నుకోవాల‌ని టీడీపీ భావిస్తుంది. కానీ ఈ వ్య‌వ‌హారం ఇరు పార్టీల మ‌ధ్య వాగ్వాదం, తోపులాట‌, నిర‌స‌నలు చోటు చేసుకోవ‌డంతో ముందుకు సాగడం లేదు. మున్సిప‌ల్ ఎన్నిక‌ను వాయిదా వేసినా కానీ.. టీడీపీ కౌన్సిల‌ర్లు అక్క‌డే కూర్చున్నారు. ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తో పాటు వైసీపీ కౌన్సిల‌ర్లు వెళ్లిపోయారు. ఎప్ప‌టివ‌ర‌కు వాయిదా అనేది మాత్రం అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఇలాంటి కీల‌క ప‌రిణామాల మ‌ధ్య టీడీపీ లంచ్ మోష‌న్ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. చైర్ ప‌ర్స‌న్ విష‌యంలో వైసీపీ కావాల‌ని గొడ‌వ సృష్టిస్తోంద‌ని, స‌జావుగా జర‌గాల్సిన చైర్‌ప‌ర్స‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వీ ఎన్నిక‌లు జ‌రిపించాల‌ని కోరుతూ పిటీష‌న్ వేసిన‌ది. కోర్టు తీర్పును బ‌ట్టి కొండ‌ప‌ల్లి చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక  ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: