ఏపీలోని కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక‌పై తాజాగా ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇవాళ హై కోర్టు తీర్పునిస్తూ.. రేపు కొండ‌ప‌ల్లి ఎన్నిక నిర్వ‌హించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, విజ‌య‌వాడ సీపీల‌కు  కోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ గురువారానికి వాయిదా వేసింది.  కౌన్సిర్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సీపీని కోర్టు ఆదేశించింది. అంత‌కు ముందు హై కోర్టు సీరియ‌స్ అయింది. రేపు ఉద‌యం పోలీసు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఎన్నిక నిర్వ‌హించి ఎల్లుండి నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోర్టు కోరింది. టీడీపీ లంచ్‌మోష‌న్ పిటిష‌న్‌పై హై కోర్టులో వాడి వేడి వాద‌న‌లు జ‌రిగాయి. కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నిక‌ను రేపు ఉద‌యం నిర్వ‌హించాల‌ని హై కోర్టు ఆదేశించింది.

 నిన్న‌, ఇవాళ ఎన్నిక‌పై వివాదాలు జ‌రిగాయి. కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ఎన్నిక‌ను య‌ధావిధిగా నిర్వ‌హించాల‌ని ఎన్నిక ప్ర‌క్రియ‌ను ఎంపీ కేశినేని న్యాయ‌వాదులు లంచ్‌మోష‌న్ పిటిష‌న్ వేశారు. రిట‌ర్నింగ్ అధికారి, పోలీస్ క‌మిష‌న‌ర్ వ్య‌క్తిగ‌తంగా హై కోర్టుకు హాజరు కావాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఆ త‌రువాత  వాద‌న‌లు విన్న త‌రువాత  చైర్ ప‌ర్స‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక రేపే నిర్వ‌హించాల‌ని, పూర్తి  ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన బాధ్య‌త పోలీసుల‌పైనే ఉంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఎన్నిక‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించిన త‌రువాత వివ‌రాల‌ను మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, విజ‌య‌వాడ సీపీని హై కోర్టు ఆదేశించింది. అయితే మెజార్టీ మ‌ద్ద‌తు క‌లిగిన టీడీపీ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వీని కైవ‌సం చేసుకుంటుంద‌ని ధీమాను వ్య‌క్తం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: