తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆక్యుపెన్షీ రేషియోను న‌మోదు చేసుకున్న‌ది ప్ర‌యాణికుల తాకిడి ఎక్కువ‌గా ఉండే సోమ‌వారం రోజు సాధార‌ణ రోజుల‌తో పోల్చితే కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పొచ్చు. అలాంటిది న‌వంబ‌ర్ 22న సోమ‌వారం రికార్డు స్థాయిలో ఏకంగా 77.06 శాతం ఆక్యుపెన్సీ రేషియో న‌మోదైంది.

క‌రోనా త‌రువాత ఆర్టీసికి ఇంత ఆదాయం రావ‌డం ఇదే తొలిసారి. ద‌స‌రా త‌రువాత హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణాల స‌మ‌యంలో కూడా ఒక‌సారి ఈ స్థాయిలో ఓఆర్ న‌మోదైంది. కానీ ఇదే రికార్డు స్థాయి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సోమ‌వారం 12.89 కోట్లు ల‌క్ష్యం పెట్టుకోవ‌డంతో రూ.14.07 కోట్ల ఆదాయం న‌మోదు అయింది. గ‌త ఏడాది ఇదే రోజు 7.85 కోట్లు మాత్ర‌మే ఆదాయం వ‌చ్చింది. దాదాపు ప‌ది రీజియ‌న్ల‌కు మించి ఆదాయం ల‌భించిన‌ది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 75.52 శాతం ఓఆర్‌ నమోదు కాగా.. మిగతా ప్రాంతాల‌తో కలిపి 85.84 శాతం నమోదు అయింది.   కిలోమీటరుకు ఆదాయం ఈపీకే రూ.40.66 గా నమోదైన‌ది. ఇటీవల నమోదైన గరిష్ట మొత్తం ఆదాయం ఇదే కావడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: