సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో బుధ‌వారం అర్థ‌రాత్రి ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.  సిద్ధిపేట‌లో స్థానికంగా  ఉన్న ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం.. రాత్రి స‌మ‌యం కావ‌డంతో ఏమి చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప్ర‌జ‌లు అయోమ‌యానికి గుర‌య్యారు. ఆసుపత్రిలో ఐసోలేష‌న్ వార్డులో ఎప్పుడు లేని విధంగా అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగ‌డం కాస్త క‌ల‌క‌లం రేపింది.

అయితే సెక్యూరిటీ సిబ్బంది రోగుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చి ప్ర‌మాదం నుంచి కాపాడారు. ఈ అగ్నిప్ర‌మాదంలో ఐసోలేష‌న్ వార్డులో ఉన్నటువంటి వైద్య ప‌రికరాలు, ఫ‌ర్నిచ‌ర్ అగ్నిప్ర‌మాదంలో కాలి బూడిద అయ్యాయి. వెంట‌నే సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల‌కు, ఫైర్ సిబ్బందికి స‌మాచారం చేర‌వేయ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసారు. ముఖ్యంగా షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే సిద్దిపేట ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం సంభవించిన‌ద‌నే  ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు. ఈ ప్ర‌మాదంలో పేషెంట్ల‌కు ఎటువంటి గాయాలు కాలేద‌ని.. ఆసుప్ర‌తిలో ఆస్తి న‌ష్టం భారీగానే జ‌రిగిన‌ట్టు స‌మాచారం. వార్డులో ఉన్న‌టువంటి మిష‌న‌రీలు ద‌గ్ద‌మ‌య్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: