ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి గురించి ప్ర‌స్తావించార‌ని చంద్ర‌బాబు క‌న్నీటిప‌ర్వంత‌మై అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా శాసనసభలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవాళ‌ తొలిసారిగా స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల స్పందించి నిరసన తెలిపిన  వారందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.

త‌న‌కు జ‌రిగిన అవ‌మానం మ‌రి ఎవ‌రికీ జ‌రుగ‌కూడ‌ద‌ని.. నాపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ నేత‌ల ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం చేసిన వారంద‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్యావాదాలు ప్ర‌క‌టించారు.  మీ తల్లికి, తోబుట్టువుకి, కూతురికి జరిగినట్లుగా  భావించి నాకు అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను అని వెల్ల‌డించారు. నా  చిన్నతనం నుంచి మా అమ్మానాన్నఎంతో విలువలతో పెంచారని.. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం అన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలని,  కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలని పేర్కొన్నారు.  వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని స్ప‌ష్టం చేసారు నారా భువనేశ్వరి.


మరింత సమాచారం తెలుసుకోండి: