గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుస్తుంది.. మొక్క‌లు నాటండి.. అంద‌మైన ఈ భూమిని స‌ర్వ‌జీవుల‌ను రక్షించాల‌ని.. మొక్క‌ల‌ను నాట‌డ‌మే కాదు కాపాడాల‌ని నిరంత‌రం ప‌రిత‌పిస్తోంది. ఒక్కొక్క‌రు మూడు మొక్క‌లు నాటే బృహ‌త్క‌ర కార్య‌క్ర‌మం ఖండాంత‌రాలు దాటి ప్ర‌తి హృదయాన్ని క‌దిలిస్తోంది. చేయిప‌ట్టి మొక్క‌ల‌ను నాటిస్తుంది. ఉద్య‌మంగా.. ఉధృతంగా ముందుకు సాగుతున్నది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం. తెలంగాణ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చిన ఈ కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్య‌ము పొందిన‌ది.

ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించిన బుట్ట‌బొమ్మ పూజాహేగ్దే.. ఇవాళ రామోజీఫిల్మ్‌సిటీలో మొక్క‌ను నాటి నీరు పోసారు. అనంత‌రం స్టార్ హీరోలైన అక్ష‌య్‌కుమార్‌, రితేష్ దేశ్‌ముఖ్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు పూజా. అనంత‌రం పూజాహెగ్దే మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాట‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌కృతి, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌తో రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ మొద‌లుపెట్టిన గ్లోబ‌ల్ వార్మింగ్ ను అరికట్ట‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. భ‌విష్య‌త్ త‌రాల మ‌నుగ‌డ‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. ప్ర‌తి ఒక్కరూ బాధ్య‌త‌గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటాల‌ని పూజాహెగ్దే కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: