కేసీఆర్ విధానం అనోలిచిత విధాన‌మ‌ని, ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌జేసేందుకే బీజేపీ ఉద్య‌మాలు చేప‌డుతుంద‌ని బండి సంజ‌య్ ఇవాళ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య‌, వైద్యం పూర్తిగా చిన్న‌భిన్నం అయింది. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల మల్టీస్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మిస్తామ‌న్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి నిర్మించ‌లేదు.  ప్ర‌తీ అసెంబ్లీ ప‌రిధిలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని నీరుగార్చాడు. రాష్ట్రంలో విద్యావ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేస్తూ కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని పేర్కొన్నారు.

కేసీఆర్ రాజ‌కీయ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని పేర్కొన్నారు. ఆయ‌న జ్యోతిష్యుడే ఈ మాట చెప్పార‌ని గుర్తు చేసారు. 2023 ఎన్నిక‌ల్లో బీజేపీ ఎట్టిప‌రిస్తితిలో విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు బండి సంజ‌య్‌. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అర్హులైన పేద‌లంద‌రికీ ఉచితంగా విద్య‌, వైద్యం అందించే బాధ్య‌త నాది అని సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. బీజేపీతోనే తెలంగాణ త‌ల్లికి విముక్తి క‌లుగుతుంద‌ని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: